పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కోడూరి వేంకటాచలకవి.

ఈ కవి స్కాందపురాణములోని శివరహస్యఖండమును తెనిగించెను. ఈతనికి బాలసరస్వతి యను బిరుదాంకము గలదు. ఈత డారువెల నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; కాశ్యపసగోత్రుడు; ఎలకామాత్యపౌత్రుడు; శంకరామాత్యపుత్రుడు. ఈ శివరహస్యఖండము శ్రీ ముసుగు ముళునాగళుప్రభుని కంకితము చేయబడినది. ఇతడు బళ్ళారి ప్రాంతములయందుండిన లింగబలిజ ప్రభువని తోచుచున్నది. కృతిపతియొక్క పూర్వులలో నొకనిని వర్ణించుచు: