పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఫక్కి వేంకటనరసయ్య.


ఈకవి శకుంతలాపరిణయ మనెడి మూడాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు సృష్టికరణవంశజుడు; భరద్వాజగోత్రుడు; నారాయణమంత్రి పుత్రుడు. ఇతడు విశాఘపట్టణములోని క్రైస్తవోన్నత పాఠశాలయం దాధ్రోపాధ్యాయుడై యుండెను. ఈకవి యీశకుంతలాపరిణయము నఱువది సంవత్సరముల క్రిందట ననగా 1836 వ సంవత్సరమునందు ముగించెను. ఇతడు అమరపదకల్పద్రుమము, నారాయణస్తవము, మదనసాయకాపరిణయము, కవిదర్పణఛ్ఛందము, నారాయణశతకము, కుమారీశతకము, అను గ్రంథములనుగూడ రచియించెను. ఈకవి కవిత్వము సలక్షణమయి మనోహరముగానున్నది. శకుంతలాపరిణయములోని కొన్ని పద్యముల నిం దుదాహరించుచున్నాను--



వేల్పూరి వేంకటేశ్వరకవి.


ఇతడు గోవ్యాఘ్రచరిత్రమును, విచిత్రరామాయణమును, పద్యకావ్యములుగా రచియించెను. ఈతడు నియోగిబ్రాహ్మణుడు; మాద్గల్యగోత్రుడు; బ్రహ్మనామాత్యపుత్రుడు. ఈతని నివాసస్థలము విశాఖపట్టణ మండలములోని విజయనగర సంస్థానము.