పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామనామాత్యుడు.


ఈకవి గయోపాఖ్యాన మనెడి రెండాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; తిమ్మమంత్రిపుత్రుడు. గయోపాఖ్యానమునకు కృష్ణార్జునసంవాదమని నామాంతరముగలదు. ఈతడు నూఱుసంవత్సరములక్రిందటివా డయియుండవచ్చును. ఇతడు తనగ్రంథమును శ్రీమదహోబిల నృసింహస్వామి కంకితము చేసెను. ఈతనిగ్రంథమునందు లక్షణవిరుద్ధము లైనప్రయోగము లనేకము లున్నను, మొత్తముమీద కవిత్వము సరసముగానేయున్నది. గయోపాఖ్యానములోని పద్యములు రెండిందుక్రింద జేర్పబడుచున్నవి:--