పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈకవి తనకావ్యమును దాక్షారామభీమేశ్వరుని కంకితము చేయుటచేత నితడు గోదావరీమండలములోనివా డయినట్టు కనబడుచున్నాడు. ఈత డేకాలపువాడో తెలియ రాలేదుగాని పూర్వకవులను మాత్రము స్తుతించి చిమ్మపూడి యమరేశ్వరుని


అని కవిస్తుతిలో బేర్కొనియుండుటచేతను, ఇంతమంది పూర్వకవులను జెప్పి మధ్యకవులలో నొక్కరిని జెప్పకపోవుటచేతను ఇతడు మధ్యకవులలో జేరినవా డేమోయని సందేహము కలుగుచున్నది. అయినను స్వతంతము లైన యితరాధారములు లేక మధ్యకవులను బేర్కొనక పోయినంతమాత్రమున నితడు మధ్యకవి యని నిశ్చయించుటకు వలను పడదు. కాని యిత డిన్నూరుసంవత్సరముల క్రిందటివా డ్నియైనను జెప్పవచ్చునని తోచుచున్నది. ఈతడు రచియించిన ధనాభిరామము కథ కొంతవరకు మనోహరముగా నున్నది. ఇంద్రసభామందిరమునందు మన్మథు నికి కుబేరునునికి రూపమెక్కువ యనియు ధనమెక్కువ యనియు వివాదము సంభవించి వారితగవు మాటలతో తెగనందున