పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రాహ్మణుడు. ఈతని తండ్రిపేరు వేంకటామాత్యుడు. ఇతడు 1600వ సంవత్సర ప్రాంతములయం దుండినవాడు. ఈకృతిపతిని గూర్చియు కృతికర్తను గూర్చియు నేనుగు లక్ష్మణకవి చరిత్రమునందు గొంత తెలుపబడి యున్నది. ఇతనిది సలక్షణమయిన మంచికవిత్వము. ఈతని శేషధర్మములనుండి రెండు పద్యము లిందు గైకొనబడుచున్నవి -

శా. మాయావిప్రుల కాద్విజుండు కడిగెన్ బాదా బుజద్వంద్వముల్
చేయూరం గునుమాక్షతాదులను బూజించెం బాత్రము ల్వైచె న
ట్లాయాపాత్రములందు నన్నము లిడన్ నారంభు డౌనంతలో
నాయింద్రుండు గృహస్థుజూచి పలికెన్ సాక్షేపపూర్వంబుగన్. ఆ.1.

ఉ. కాలినయిర్పగుండ్ల మఖగహ్వరభాగములందు గ్రుక్కుచున్
సోలుపు లేర్పడ న్మెఱుగుసుదులు కన్నుల గ్రుచ్చుచుం దలల్
నెలకు జేర్చి పాదములు నింగికి నెత్తుచు బెక్కుజాడలన్
గాలభటు ల్వెతిల్గుడుపగా బడియుండుదు రంతమీదటన్. ఆ.3.

నూతనకవి సూరన్న.

ఈకవి సకల జనాభిరామ మను నామాంతరముగల ధనాభిరామ మను మూడాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు; ఆపస్తంబ సూత్రుడు; కాశ్యపగోత్రుడు; తిప్పయామాత్య పుత్రుడు. కవి తన్ను గూర్చి యిట్లు చెప్పుకొనుచున్నాడు. -


కవి తనగ్రంథమున వ్రాసికొన్న యీక్రిందిపద్యమునుబట్టి తాను దిక్కనసోమయాజి సంతతివాడనని చెప్పుకోదలచినట్టు కనపట్టుచున్నది--