పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1869 వ సంవత్సరమునందుండిన కవులను బేర్కొనియుండుటచేత నిత డాకాలమునకు దరువాత నుండినవా డనుటస్పష్టము. ఇత డిప్పటికి నూఱుసంవత్సరముల క్రిందట 1700 వ సంవత్సరప్రాంతములయం దుండియుండును. పైపద్యమున బేర్కొనబడిన యయ్యలరాజవంశజు లయినకవులలో బర్వతరాజును గొండయ్యయు దిమ్మయ్యయు జేసీనగ్రంథము లే యో తెలియరావు. ఈకవితండ్రి సూరనార్యుడు; తల్లి కొండమాంబ; గోత్రము కౌండిన్యసగోత్రము. ఇతనికవిత్వములో లక్షణవిరుద్ధము లయిన ప్రయోగము లనేకములు గలవుగాని మొత్తముమీద గవిత్వము ప్రౌఢమయి రసవంత మయినదిగా నున్నది. ఈపుస్తకమునం దన్యదేశ్యము లనేకములు వాడబడియున్నవి. ఈత డాయాజాతులవారిని వర్ణించవలసివచ్చినప్పుడు మిక్కిలి కష్టపడి వారివారికుచితము లయిన యుపకరణాదులనామముల నన్నిటిని సంగ్రహించి వివరించియున్నాడు. ఈకథయొక్క ముఖ్యోద్దేశము