పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సిరిప్రెగడ ధర్మనామాత్యుడు.


ఈకవి నలచరిత్రము నాఱాశ్వాసముల పద్యకావ్యమునుగా రచియించి, శ్రీవేంకటేశ్వరుల కంకితము చేసెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; హరితసగోత్రుడు; తిప్పయామాత్యపుత్రుడు. ఇతడు నలచరిత్రములొ దనదండ్రి నిట్లు వర్ణించియున్నాడు--


తనతండ్రి యిందుర్తిసీమలోనివాడనియు, ఈ క్రిందిపద్యములలో దనమేనమామ పేరూరి నివాసుడనియు, కవి చెప్పుకొనుటచేత నీతడు గోదావరీ కృష్ణామండములలోని వాడని తోచుచున్నది.--