పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చింతకుంట కోదండరామకవి.


ఈకవి సునందాపరిణయమను నామాంతరముగల ప్రదీపచరిత్రము నైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నందవరీక నియోగి బ్రాహ్మణుడు, అక్కనమంత్రిపుత్రుడు. కవి తన వంశజులలో సుప్రసిద్ధుడయి యుండిన రాయన భాస్కరు నిట్లు వర్ణించియున్నాడు---