Jump to content

పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గా కాంచీపురమునకు బోయెను. మొత్తముమీద నాంధ్ర దేశమున నీతడు పదునెనిమిది మాసములు లేక రెండుసంవత్సరముల కాలము గడపెను. ఈతడిచ్చిన కొలతలు ఒకప్పుడు ఎక్కువగ నుండుచు వచ్చినను అవిపొరబాటులని గ్రహింపవలసినదే గాని మరియొండుగాదు. కాక ఆకాలమున దేశమునందు ప్రయాణమున కనుకూలములయిన బాట లిప్పటివలె నుండక కొన్ని సమయము లందు కొండలడ్డము చేతను, అడవులడ్డము చేతను చుట్టుతిరిగి యుండవచ్చును. మనదేశమును జూచి మనచే విస్మరింపబడియున్న వృత్తాంతములను స్థలములను మరలనొకసారి జ్ఞప్తికిదెచ్చి మహోపకారము చేసిన యుఆన్ చ్వాంగ్ మనకు చిరస్మరణీయుడే కాదు, మనకృతజ్ఞతకు బాత్రుడైనవాడు.