పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డును. ఈదేశమును వర్ణించిన మనయాత్రికు డీరాజ్యమెవరి పాలనము నందున్నదో యాకాలపు కాంచీపుర పల్లవరాజగు నరసింహవర్మకు సామంతుడో లేక స్వతంత్రుడో దెల్పి యుండలేదు. అయినను చోళమండల మితర శాసనముల బట్టి పల్లవ రాజ్యములో జేరినట్లు దెలియుచున్నది; గావున సామంత రాజ్యమనియే యెంచవలయును.

చోళమండలమునకు నెల్లూరు (విక్రమసింహపురము) రాజధాని గావచ్చునని వాటర్సు ఫెర్గసను మున్నగు పండితులు నిర్ణయించిరి, గాని వారివాదము తృప్తికరముగ లేదు. కాని చోళరాజధాని ఎచ్చటనున్నదో అర్హతుడుత్తరు డెక్కడ నివసించినో దెలియరాదు. చోళ దేశమునుండి మనయాత్రికుడు తనగురువగు శీలభద్రుని జన్మస్థానమగు కాంచీపురమును ద్రావిడ దేశమును జూడబోయెను.

యుఆన్ చ్వాంగ్‌తో నాంధ్రదేశమును, మహేంద్రగిరి మొదలుకొని ద్రావిడదేశము వఱకును ప్రయాణముసల్పి యాతడు వర్ణించిన వర్ణలనుబట్టి యాకాలపు స్థితిగతులను వ్యవస్థలను కొంతవఱకు గ్రహింపగలిగితిమి. ఇంచుమించుగా క్రీ.శ. 637 వ సంవత్సరమున, వర్షకాలము గడచిన వెనుక కళింగదేశమును బ్రవేశించి యక్కడ కొద్ది దినములుండి కోసలమున కరిగి యచ్చటనుండి, ఆంధ్ర వేంగీరాజ్యమును జొచ్చి పిదప విజయవాటికేగి యచ్చట క్రీ.శ. 639-640 వ సంవత్సరముల నడుమభాగమున నివసించి పిమ్మట చోళదేశముమీదు