పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనకు సంశయము లున్నవనియు, వానిని దీర్పవలసినదనియు నాతని ప్రార్థించెను. దేవుడు ప్రశ్నించుచుండ, అర్హతుడొక దాని వెనుక నింకొక దానికి సదుత్తరము నొసంగెను. ఆతడాడిన ప్రతిపదమును పరిశీలించుచు దేవుడు సూక్ష్మములును దురవగాహములునగు ప్రశ్నలనువేయ నారంభించెను. అర్హతుడట్లే ఏడవ పర్యాయము వాదమారంభించు వఱకు ప్రత్యుత్తరమిచ్చెను, గాని పిదప సమాధానము చెప్పజాలక మౌనము వహించి తన దివ్యప్రభావముచే పరకాయ ప్రవేశముచేసి తుషిత స్వర్గమును జొచ్చి మైత్రేయుని దేవుడడిగిన ప్రశ్నకు ప్రత్యుత్తర మీయవలసినదని ప్రార్థించెను. మైత్రేయుడాతనికి గావలసిన సమాధాన మిచ్చి "అర్హతుడా! ఈ ప్రశ్నవేసిన వాడెవడో నీవెరుగుదువా? ఆతడు బోధిసత్త్వుడగు దేవుడు, మహాప్రజ్ఞావంతుడు. అనేక కల్పములనుండి జీవించుచు ధర్మము (బౌద్ధమతము) నవలంబించుచున్నాడు. భద్రకల్పముయొక్క నడుమ కాలమున ఈతడు బుద్ధుడై యవతరించును. నీవిది యెఱుగవు. కావున వెంటనే యరిగి యాతని విశేషముగ సత్కరించి పూజింపుము" అని చెప్పి పంపివైచెను.

ఆయుత్తర క్షణమున అర్హతుడు నిజశరీరమున బ్రవేశించి బోధిసత్త్వుడడిగిన ప్రశ్నలకు చక్కగా ప్రత్యుత్తరముల నిచ్చి సందేహములను బాపెను. దేవుడంతట "అయ్యా! ఇపుడు నీవు చెప్పిన విషయములు నీవు జ్ఞానివై స్వతంత్రముగ దెలిసికొనినవిగావు. మైత్రేయబోధిసత్త్వుడుతక్క నితరుల కీ