పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ యూహయే నిజమైనచో, యుఆన్ చ్వాంగ్ చెప్పినది నిజమయి యుండవచ్చును. మరియు పూర్వము ఇంద్రకీలపర్వతముమీద, దక్షిణవైపునగూడ నదినంటి యేమయిన గుహలుండెనేమో; యిపుడవియన్నియు నది నొఱసి ప్రవహించుటచే జీర్ణమయి యుండవచ్చును. ఈగుహలు మఠమును నగరమునకు సమీపముగా నుండినట్లు యాత్రికుని వర్ణనలవలన దెలియుచున్నది.

ఊరికి దక్షిణమున నొకకొండ గలదనియు, నచ్చట భావవివేకస్వామి తపస్సు చేసికొన్నట్టియు అసురుల హర్మ్యమున్నట్టియు పర్వతము గలదని యుఆన్ చ్వాంగ్ చెప్పుచున్నాడు. సీతానగరము ఉండవిల్లి కొండలమీదనున్న ఏకశిలానిర్మితమయిన దేవాలయమును కొండయు యుఆన్ చ్వాంగ్ వర్ణించినట్టి స్థలమని "సూయలు" నిరూపించుచున్నాడు. ఉండవిల్లి కొండపైనున్న, దేవాలయము ప్రాచీనతను జాటదని ఫెర్గసను వాదించినప్పటికిని యితరబౌద్ధగుహలు ఆలయములు ఎట్లుబ్రాహ్మణ శైవ మతవిజృంభణకాలమును మార్పుచేయబడినవో యీగుహాలయమును తరువాత కాలమున చిత్రవిచిత్రాలంకారములతో శిల్పముతో తరువాత కాలమున అభివృద్ధి చేయబడి యుండునని సమాధానము చెప్పవచ్చును.

భావవివేకు డాంధ్రుడైనను, మహా తార్కికుడైనను శాస్త్రజ్ఞుడైనను బౌద్ధుడగుటచే నీర్ష్యాపరులగు బ్రాహ్మణ మతస్థు లాతని బుద్ధిపూర్వకముగ విస్మరించిరి. ఇతరబౌద్ధగ్రం