పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"అచ్చట మూగినజనులు అతని వాక్యములను విని యాశ్చర్య భయముల నొక్కమారుగా బొందిరి. పిమ్మట "ఇది పాతాళము, యిక్కడ పాములుండును. మమ్ముల నవి చంపివేయును. మేము నీతోడ రాజాలమ"ని చెప్పిరి. భావవివేకుడు వారినట్లు ముమ్మాఱు పిలచెను: ముమ్మాఱును, వారాతని అనుగమించుటకు సంశయించిరి. కాని యార్వురు మాత్రము అతనివెంట రా సన్నద్ధులయిరి. జనసమూహమంతయు దనవంకయు, దనయార్వుర శిష్యులవంకయు, భీతచిత్తులయి నివ్వెరపాటుతో దిలలించుచుండ భావవివేకుడు సొరంగములోనికి నడిచిపోయెను. వెంటనే పర్వతసొరంగముచుట్టును శిలాద్వారములు మూసికొనిపోయెను. వెనుక మిగిలినవారు తమ తెలివిమాలినతనమునకు సిగ్గిలుచు, భావవివేకస్వామి పలుకులు నాలకింప మైతిమిగదా యని పశ్చాత్తాపముతో నిండ్లకు మరలిపోయిరి."

ఇక్కడనుండి దక్షిణముగా వేయిలీలు రెండవందల మైళ్ళు ప్రయాణముచేసి మేము చోడమండలము (చు-ళి-య) బ్రవేశించితిమి."

మన యాత్రికుడు ధనకటక దేశమును "తే-న-క-చే-క" అని పేర్కొనియున్నాడు. తే-న-క-చే-క పదము సంస్కృతమున ధనకచకము. లేక ధనకటక మగుచున్నదని పండితు లంగీకరించిరి. ఈధనకటకము తిబెతు దేశ గ్రంథములలో ధాన్యరాసులుండు పట్టణమని పిలువబడుచున్నది. ధాన్యకటకము