పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుజ్జవిష్ణువర్థనుని కుమారుడు, మొదటి జయసింహవల్లభుడు. క్రీ.శ. 633 వ సంవత్సరమున సింహాసన మధిష్ఠించి 666 వఱకును బాలించెను. ఈతడు సింహాసన మెక్కిన రెండుమూడు సంవత్సరములనాటికే యుఆన్ చ్వాంగ్, ఆంధ్రదేశమును జూడ నేతెంచియుండెను. అప్పటికి దేశమున, జనసంఖ్య చాల తక్కువగా నున్నదని, చీనా యాత్రికుడు వ్రాయుచున్నాడు. అందుల కారణము రెండు మూడు తరములనుండి యాంధ్రదేశ మప్పటికి యుద్ధములలో మునుగుచు దేలుచున్నట్లు చరిత్ర వాకొనుచున్నది. పూర్వ చాళుక్యులు, దేశమును జయింపకపూర్వము వేంగీరాజ్యమున శాంతిలేకుండెను. కళింగరాజులయిన పూర్వగాంగేయవంశజులు వేంగీపాలకులయిన విష్ణుకుండినులతో, సర్వదా యుద్ధములు సలుపుచుండిరి. కళింగులకును విష్ణుకుండినుల కాత్మబంధువులయిన వాకాటక, కాలచుర్యులకును ప్రబలవైరమగుటచే, విష్ణుకుండినులతో, కళింగరాజులకు వైర మావశ్యక మయ్యెను. ఈ యుభయ లాకారణమున, నొకరి రాజ్యము లొకరు ఆక్రమించుకొని పగ దీర్చుకొనుటకు సర్వదా ప్రయత్నించుచుండిరి. మరియు సత్యాశ్రయుడు, వేంగీరాజ్య సింహాసనముపై సోదరుని నిలిపినతరువాత, చాళుక్యరాజ్యమును సుస్థిరము చేయుటకై, కుబ్జవిష్ణువర్ధనుడు, చిన్నచిన్న రాజకుటుంబములు తోడను, సామంతాధివుల తోడను బహుకాలము యుద్ధములు చేసియుండ వచ్చును. ఆతని తరువాత