పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనబడు నిప్పటి విశాఖపట్టణము గంజాం మండలములును బస్తరు సంస్థానమున్న ప్రాంతమును, పూర్వ గాంగవంశరాజులును బరిపాలించుచుండిరి. పశ్చిమ చాళుక్యరాజగు రెండవ పులికేశి సత్రాశ్రయవల్లభమహారాజు, పూర్వాంధ్రదేశమును జయించి, క్రీ.శ. 607 సంవత్సరప్రాంతము తన ప్రియానుజుడగు కుబ్జవిష్ణువర్థనుని తనకు ప్రతినిధిగా పాలింప నియమించి, దిగ్విజయార్థమై దక్షిణాభిముఖుడై, పల్లవరాజధానియగు కాంచీపురము మీదికి జనెను. కుబ్జవిష్ణువర్థనుడు, పిష్ఠపురము రాజధానిగా జేసుకొని క్రమక్రమముగా వేంగీమండలము నంతను, కళింగదేశములోని దక్షిణభాగమును, కృష్ణానదికి దక్షిణమునగల విషయములను జయించి స్వాధీనము జేసుకొని రాజ్యమును విస్తరింపజేసి క్రీ.శ. 615 వ సంవత్సరమునాటికి సర్వస్వతంత్రమైన చిన్న రాజ్యమును నిర్మించి, మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, పరమభట్టారకాది బిరుదమును ధరించి, పశ్చిమచాళుక్యరాజగు సోదరునికి, కప్పము గట్టుట మాని స్వాతంత్ర్యమును బ్రకటించెను.

ఇత డాంధ్రుల చరిత్రయందు పూర్వచాళ్యుకాన్వయ వంశకర్తగా బరిగణింపబడుచున్నాడు. ఈతని వంశీయు లాంధ్రదేశము నైదు శతాబ్దములకాల మవిచ్ఛిన్నముగా బరిపాలించియుండిరి. ఇతని వంశములోనివాడు, ఆంధ్రులకు చిరపరచితుడును పూజ్యుడును, ఆంధ్రమహాభారత కృతిపతియునగు రాజరాజనరేంద్రుడు.