పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హింపవలయును. ఆలంకారికుడును, కాశ్మీరవాసియునగు భామహుడీతనికి సమకాలీనుడని కొంద ఱందురు. కాని యిది విశ్వసనీయముగా గన్పట్టుట లేదు. ఇప్పటి చరిత్ర కారులు దిజ్ఞ్నాగా చార్యుని క్రీ.శ. 5, 6 శతాబ్దముల నడుమ, జీవించి యుండినట్లు నిర్ణయించు చున్నారు. ఈతని గ్రంథములు మొదటి పర్యాయము క్రీ.శ. 560 సంవత్సరమున చీనాభాషలోనికి భాషాంతరీ కరణము గావింపబడెను. తర్కవిద్య నభ్యసించు విద్యార్థుల కుపయుర్తములయిన, ఎనిమిది గ్రంథముల నీతడు తర్కశాస్త్రమునందు రచించెనని వాని బేర్లను ఈచింగ్ యాత్రికుడు పేర్కొని యున్నాడు. దిజ్ఞ్నాగుడు ఒక శాస్త్రమును గూర్చి వ్రాసి మరియొక శాస్త్రమునుగూర్చి వ్రాయలేదని చెప్ప నక్కరలేదు. ఆతడన్ని శాస్త్రములను, పరిశీలించిన వా డగుటచే నాతని గ్రంథములు నూటికి మించియున్నవి. 'న్యాయ' సిద్ధాంతము నీతడభ్యసించెను. కాని బ్రాహ్మణ నైయ్యాయికులీతని భాష్యము నంగీకరింపరు. ఈతడు ప్రజ్ఞా పారమితా శాస్త్రమును బూర్ణముగ నలవడ జేసికొనెను యోగాభ్యాస రహస్యములును గ్రహించి, మానవుని జన్మ రాహిత్యమునకు మార్గములను అన్వేషింప సమకట్టెను. దిజ్ఞ్నాగుని, ప్రజ్ఞా పారమితా శాస్త్రముపై వ్యాఖ్య ఆర్య ప్రజ్ఞా పారమితా సంగ్రహ కారికా వివరణ' యని బిలువబడుచు, తిబెతు భాషయందు 'త్రిరత్నదాస' యని భాషాంతరీకరింపబడి యున్నది. ఈతడు హేతు విద్యాశాస్త్ర