పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండి నపుడీ భ్రమరగిరికి సరిపోవు పర్వత సంఘారామమును గూర్చి వినినదానిని స్వయముగ జూచినవానివలె వర్ణించి వ్రాసినాడు. కాని యాత డీపర్వత శిఖరమును జూడనేలేదు. ఆతడు వ్రాసిన వృత్తాంతముగూడ మిక్కిలివింతగా నున్నది. ఆత డీశిఖరము పో-లో-యు అనగా పారావతమను అర్థము వచ్చు బేరున బిలచినాడు. ఆకొండలో పావురపు గూండ్లవలె గుహలుండుటచే, పారావతమను పేరుగలిగి యుండవచ్చు ననుకొనుట యొక యూహ! కాని యాతడు పారావతమని బిలచుట కింకొక కారణము కూడనుండును. తిబెతు దేశ బౌద్ధగ్రంథములందు నాగార్జునుడు శ్రీపర్వత సంఘారామమునకు భిక్షువుల రావించి, నివాసము లేర్పఱిచెననియు, వార యుపయోగార్థము ఒక గొప్పపుస్తక భాండారమును సమకూర్చెననియు వ్రాయబడియున్నది. శ్రీపర్వతమునకు పారావతమను పేరు. అట్లు చీనాయాత్రికుని వ్రాతలందు పొరబాటుగా బడియుండవచ్చును. మఱియు నాగార్జునుడు ది-పా-ల-గిరి అని తిబెతువారిచే బిలువబడుచుండిన శ్రీపర్వతముపై చిరకాలము నివసించి నిర్వాణము బొందెనని తిబెతు గ్రంథములు వాకొడుచున్నవి. బౌద్ధమందు సార్వత శ్రీపర్వతనునియు సంస్కృత వాఙ్మయమున శ్రీశైలమనియు, యుఆన్ చ్వాంగ్‌చే భ్రమరగిరి యనియు నదాహరింపబడిన పర్వతరాజము కర్నూలు (కందనోలు) మంటలములో కృష్ణానది నానుకొని, పైని వ్రేలాడుచున్న శిఖరముపై