పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నున్న సంఘారామమున జీవయాత్ర గడపెనని, యుఆన్‌చ్వాంగ్ వ్రాయుచున్నాడు. పో-లో-మో-లో-కీ-లీ యనునది భ్రమరగిరి యని సంస్కృతమున సరిపోవుచున్నది. మన యాత్రికు డిచ్చిన కొలతనుబట్టి దక్షిణకోసలరాజథాని భాండక్ నగరమని నిశ్చయించి యచ్చటనుండి కొలచిచూచిన యెడల నీపర్వతమఠము చాందాకు నాగ్నేయ మూలగా మాణిక్యదుర్గమునకును, నరదా నదికిని సమీపమున నుండ వలయును, గాని యచ్చట నీయత్రికుని వర్ణనలకు సరవచ్చు పర్వతశిఖరముగాని సంఘారామముగాని గానరాదు. ఇక ఫెర్గసనుగారు, భాండక్ నగరసమీపమునగల విద్యాసాని పర్వతమే యుఆన్ చ్వాంగ్ వర్ణించిన భ్రమరగిరిసంఘారామమని నిరూపింప బ్రయత్నించిరిగాని, మనయాత్రికుని వర్ణనల కచ్చటి ప్రాచీనగుహలు సరిపోవుట లేదు. యుఆన్‌చ్వాంగీ భ్రమరగిరినల్లని శిఖరముగల పర్వతమనిగూడ వర్ణించియున్నాడు. భ్రమరగిరి, పార్వతి, దుర్గలవంటి శక్తిస్వరూపిణులగు దేవతయొక్కగిరియనిగాని నల్లతుమ్మెదవంటిశిఖరమనిగాని అర్థము చేయవచ్చును. యుఆన్ చ్వాంగ్, భ్రమరగిరిని వర్ణించుటలో కొలతలను తప్పుగా నిచ్చి పొరబడినాడు. అట్లు కాదేని యాతని సి-యూ-కీ చీనాపాఠమును పండితులు తప్పుగాచదివి యపార్థము చేసుకొని వ్రాసి యుండురు. మన యుఆన్ చ్వాంన్ వలెనే యంతకు బూర్వము వచ్చియుండిన పాహియాను గూడ తాను కాశీనగరమున