పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదయనుడు, లేక ఉత్రాయనుడు, అను పేరులకు సరిపోవు తిబేతుపదముల బిలువబడియున్నాడు. మరియు జేతకుడు లేక జీవాతకుడనియు కూడ నొకచోట బేర్కొనబడి యున్నాడు. తిబేతు దేశచరిత్రకారుడును మిక్కిలి ప్రాచీనుడునగు తారానాధుడు[1], నాగార్జునుని పోషకుడైన రాజు యౌవనమున జేతకుడని బిలువబడుచుండిన ఉదయన మహారాజని చెప్పియున్నాడు. శాతవాహన వంశము దక్షిణాపథమున క్రీ. పూ 220 మొదలుకొని క్రీ. శ.230 వఱకును పరిపాలిచియుండెను. ఈ నడుమ కాలమున నాగార్జును డెపుడుజీవించియుండెనో ఉదయన నామాం కితుడగు రాజును గుర్తింపలేకపోవుటవలన నిర్ణయింప వీలుగాకున్నది. నాగార్జునుని పోషించిన చక్రవర్తి, యజ్ఞశ్రీ శాతకర్ణి యని శ్రీయుత చిలుకూరి వీరభద్రరావుగారు నిర్ణయించిరి, గాని వారుజూపిన యాధారములు తృప్తికరములుగ లేవు. ఎట్లయినను ఆతడు చిరంజీవియై కొన్ని శతాబ్దములు బ్రతికి యుండినట్లు విశ్వసింపకపోయినను క్రీ. శ. మొదటి శతాబ్దమున నిర్వాణము బొందెననిమాత్రము నిర్ణయింపవచ్చును. ప్రస్తుత మాతని కాలనిర్ణయము ఇంతకంటె నిస్సంశయముగ నిర్ణయింప సాధ్యము గాదు.

ఇక నీబోధి సత్త్వుడు, కోసలదేశమునకు నరువదిమైళ్ళ దూరమునున పో-లో-మో-లో-కీ-లీ యను పర్వతము మీద

  1. Taranatha's History of Buddhism ps 71, 73 & 303,