పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మించుగ క్రీ. పూ. 492 వ సంవత్సరమున జననమొంది, శకరాజగు కనిష్కునికి సమకాలీనుడై యుండినట్లు రాజ తరంగిణి దెల్పుచున్నది; కుమార జీవునిచే రచింపబడిన లంకావతార సూత్రమందు అంత్యభాగమున, నీతని జీవితము భావికాలమున జరుగునట్లు స్పష్టముగ వర్ణింపబడినది.- కుమార జీవుడు నిశ్చయముగా, క్రీ. శ. 4వ శతాబ్దారంభకాలమున జీవించియున్నట్లు దెలియుచున్నది. గావున, నాగార్జును డంతకు బూర్వము మూడవశతాబ్దమునందు జీవించియుండవలయునని కొందఱి యబిప్రాయము. ఈతని గ్రంథములందు కనిష్కుడు, కినికుడు మొదలుగా గల రాజుల నామములు, వసుమిత్రుడు, అశ్వఘోషుడు, కాత్యాయనీపుత్రుడు, ధర్మగుప్తుడు, రాహులభద్రుడు, మున్నగు బౌద్ధమతాచార్యుల నామములు గానవచ్చుట జేసి, నాగార్జునుడు క్రీ.శ. మూడవ శతాబ్దమువాడని వాటర్సు పండితుని యభిప్రాయము[1] ; కాని యిదియును నిశ్చయము కాదు.

నాగార్జు నాచార్యునిచే రచింపబడిన గ్రంథములలో నిపుడు ఇరువది మాత్రమే మిగిలియున్నవి. అవియు గూడ చీనాభాషలో భాషాంతరీకరణములై యున్నవి. నిరీశ్వర వాదమును, ప్రతిపాదించుట జేసి బౌద్ధుల గ్రంథములన్నియు, నసత్యములనియు నప్రమాణములనియు మన దేశమున బ్రాహ్మణులచే దగ్ధముగావింపబడెను. ఈతనిగ్రంథములలో సుహృల్లేఖ

  1. Walter's Yuan chwang Vol, II p. 204