పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నదనియు మనము నిశ్చయింపవచ్చును. పీనిషీ పండితుడు రచించిన మన యాత్రికుని జీవతమందుగూడ నీ దేశము దక్షిణకోసలమనియే ఉదహహరింప బడినది. దక్షిణ కోసలము పురాతనకాలపు విదర్భయని కన్నింగ్‌హాముగారి [1] యభిప్రాయము. ఫెర్గసనుదొర దక్షిణకోసలమును చిటిస్‌ఘడ్‌ ప్రాంతమునకు సరిబుచ్చుచు, వైర్ ఘడ్ లేక భాండక్ నగరములు కోసల రాజధానులుగావచ్చునని నిశ్చయించినాడు. ‡ కోసల మాధ్రదేశమున భాగముగా నుండె ననుటకు కొన్ని ప్రబల కారణములు గలవు. ఆంధ్రులు కోసలదేశమును, కోసలనాడని వ్యవహరించుటయు, నచ్చటినుండి వలస వచ్చిన బ్రాహ్మణులను కోసల (కాసల) నాటివారని బిలచుటయు, నెల్లరకు దెలిసిన విషయమే. అదియును గాక, శాతవాహనుల క్రింద నాంధ్రమహాసామ్రాజ్యము విస్తరించి నపుడు దక్షిణకోసలము నాంధ్రదేశాంతర్గత భాగమైపోయెను. దక్షిణకోసలదేశమును మనయాత్రికునికాలమున మహాకోసల దేశాధీశులగు సోమ వంశీయులో, ప్రవరపురాధీశ్వరులగు వాకాటక రాజులో, త్రిపురాధీపతులు కలచుర్యులో పాలించుచుండవలయును. ప్రస్తుత మాదేశచారిత్రమింతకంటె విపులముగ దెలియవచ్చుటలేదు.

కోసలరాజధానిని వర్ణించిన వెనుక, మన యాత్రికుడు నాగార్జున, దేవ బోధిసత్త్వుల గూర్చిన వృత్తాంతములను

  1. Ancient Geography of India p. 5-9.