పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘారామమునుండి బౌద్ధులను వెడలగొట్టించి, తమ స్వాధీనము చేసికొనిరి. అప్పటినుండియు బౌద్ధబిక్షువులచ్చటగా పురముండినట్లు కానరాదు. దూరమున నిలువబడి యున్నతమైన యా పర్వతశిఖరమువంక జూచునపుడందలి సొరంగములును, గుహలును గానుపించెనుగాని, యా సంఘారామమును బ్రవేశించు సొరంగమును గాంచలైనైతిని. ఈ కాలమున నచ్చట నివసించెడి బ్రాహ్మణులు, తమలో రోగులయినవారికి వైద్య చికిత్సకొరకు బౌద్ధుల రావించవలసిన, వారి ముఖములకు ముసుగులు వేసియో, కండ్లకు గంతలుకట్టియో లోనికి గొంపోయి పని పూర్తియయిన తరువాత మరల నట్లే యీవలకు గొనివచ్చి కండ్లుతెరచెదరు. ఇందువలన బౌద్ధుల కెవ్వరికిని లోని కరుగుమార్గము తెలియరాదు"

యుఆన్ చ్వాంగ్, కోసలదేశమునుగూర్చి, వింతకథలను వర్ణించినాడు. ఇందీతడు, తాను ప్రత్యక్షముగ జూచినదానిని వినినదానిని గూడ నొక్కరీతిగ వర్ణించినాడు. అందువలన నీతడు వర్ణించిన యద్భుత విషయములు ఆవిశ్వసనీయములని మనకు దోచును. కావున వాటిపరీక్ష యావశ్యకము. కోసలమని మన యాత్రికుడు చెప్పియున్నాడు గాని యిది యుత్తరకోసలము గాక, దక్షిణ కోసలమనియు, నీకాలపు మధ్యమాగాణములలోని నాగపురముజిల్లాకు ఆగ్నేయముగా నున్న బస్తరురాజ్య భాగము విశాఖపట్టణ మండలములోని వాయువ్య భాగమును కలిసి దక్షిణకోసల మగు