పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాద్వహుడు వేయిమంది భిక్షువుల ప్రార్థించి రావించెను! భిక్షువుల యుపయోగార్ధము నాగార్జునుడు బౌద్ధధర్మశాస్త్ర గ్రంథములను బోధిసత్త్వుల వ్యాఖ్యానములను, మున్నగు ననేక గ్రంథములను సంపాదించి యాసంఘారామమున నొక పెద్ద భాందాగారమును సమకూర్చెను. ఆతడు సంఘారామముయొక్క కడపటి యంతస్తునందు బుద్ధుని సువర్ణవిగ్రహమును, సూత్ర, శాస్త్ర గ్రంథముల, నుంచెను. మొదటి యంతస్తునందు, పరిశుద్ధలయిన బ్రాహ్మణులకు నివాస మిప్పించెను. నడుమ మిగిలిన మూడంతస్తులందును భిక్షువులనుండ నేర్పఱిచెను. ఈ సంఘారామము బూర్తి యగునప్పటికి సాద్వహరాజునకు తొమ్మిది కోట్ల సువర్ణములు ఖర్చుపడియెనని ప్రాచీన గ్రంథములు వాకొనుచున్నవి.

ఇట్లు కొంతకాలము గతించునప్పటికి బ్రాహ్మణులకును, బౌద్ధులకును కలహములు జనించెను. ఆకలహములను దీర్చుమని బౌద్ధులు, రాజునొద్ద మొఱబెట్టుకొన బోయిరి. ఇంతలో బ్రాహ్మణులు "మనతో వాగ్వాదమున గలహించి యీ బౌద్ధులు, రాజుతో నేరము చెప్పుట కేగినారు. కానిండ"ని, రోషించి దుర్మార్గులయి, అచ్చటి కావలివాండ్రు మొదలుగాగల పరిచారకులతో గలసి దుస్తంత్రములబన్ని, సమయముకొఱకు నిరీక్షించియుండి, సంఘారామమును పాడుచేసి, సింహద్వారమును సొరంగమును గప్పివేసి బౌద్ధసన్యాసులు లోనికి రాకుండ నిరోధించిరి. ఇట్లా బ్రాహ్మణులు