పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్‌చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

౨౭

హితోపదేశమొనర్చెను.

"జనని యుపదేశ వాక్యముల నాలకించి యారాజ సుతుడు సత్వరము నాగార్జునుడు నివసించు చుండిన మఠమునకు వచ్చెను. అతనిరాక గాంచి, ద్వారపాలకుడు భయపడి పలాయనుడయ్యెను. రాజ కుమారుడును లోనికి బరుగెత్తెను. నాగార్జును డాసమయమున పడసాలలో పచారు చేయుచు, మంత్రములను పునశ్చరణ గావించుచుండెను. ఏదియుగాని సమయమున రాజకుమారు డట్లు భిక్షవాటిక జొచ్చుటగాంచి, ఆశ్చర్యము నొంది యాతడు "కుమారా! ఈ సాయంతనపువేళ నింత తొందరగా, బిక్షువులు నివసించు మఠమునం జొచ్చుటకు గతం బేమి? నీకేమైన విపత్తు వాటిల్లెనా? కాక నేడేదయిన కారంతరమున శరణార్థివై వచ్చితివా?" యని యాతురతతో నడిగెను.

ఆప్రశ్నకు, రాజకుమారుడు మెల్లగా "మహానుభావా! వినుడు. ఇంతకు బూర్వము నాజననితో శాస్త్రార్థములు చింతన చేయుచు, ప్రపంచముతో సంబంధము వీడిన సన్యాసుల గూర్చి నేనిట్లంటిని. "అమ్మా! ప్రపంచమందలి జీవరాసులకు ప్రాణముపై నాస మెండుకదా! అట్టియెడ త్యాగము నుద్ఘోషించు ధర్మశాస్త్రములు, ఇతర జీవులు వాంఛింపునపుడు, ప్రాణత్యాగము సేయుట త్యాగమని యా సన్యాసుల కెందులకు విధించి యుండలేదు?" అపుడు నామాటలకు, నాజనని కుమారా! అట్లు గాదు. దశ