పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్‌చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

౨౫

నారంభించెను. మరి కొంతసేపటికి నోరారిపోయి మాటలాడలేకపోయెను. పిమ్మట ఆసనమునుండి లేచి వినమ్రుడై, చేతులు జోడించి, తన యజ్ఞానమును క్షమించి శిష్యునిగా పరిగ్రహింపవలసినదని ప్రార్థించెను. దేవుని సంభ్రమమును గాంచి నాగార్జునుడపుడు "దేవా! ఆసీనుడవుగమ్ము! భయవర్జితుడవు గమ్ము. ఇపుడే నీకు నేను బుద్ధుని ధర్మములందలి రహస్యముల నుపదేశింతును." అని శాతంతో బల్కెను. దేవుడంతట నాగార్జునుని మ్రోల సాష్టాంగముగ బ్రణమిల్లి హృదయ పూర్వకముగ" నేటి మొదలు యిా యజ్ఞానుని శిష్యునిగా బరిగ్రహించి యనుగ్రహింప వేడెదను." అని ప్రార్థించెను. నాగార్జునుడతని యెడ జాలిగొని శిష్యునిగా బరిగ్రహించెను.

"మూలికలచే నౌషధులను తయారు చేయుట యందు నాగార్జును డద్వీతీయుడు. మూలికల రహస్యము నాత డెఱింగినట్లు యితఱు లెరుగరు. అతడొక ఔషధమును సేవించి బుద్ధి బలమును దేహదార్ఢ్యమును చెడకుండ, రూపు మారిపోకుండ చిరకాలము జీవింపగల్గెను. అతని జీవితకాలము కొన్నిశతాబ్దములని జెప్పుదురు. రాజు సాద్వహుడు నీయౌషధమును సేవించి నాగార్జునివలె చిరకాలము జీవింపగల్గెను. నాగార్జును డంత ప్రజ్ఞావంతుడయ్యు ను, తనంతట తానె, ప్రాణ త్యాగము గావించుకొనెను. నాగార్జునుని జీవితముతో సాద్వహుని ఆయువును అంతమొందు. విధి బలమై