పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౪

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

ఈ భువిని నిను బోలినవారు కడచినవారిలో గాని, యిపుడున్న వారిలోగాని, నాకెక్కడను గాన్పించుటలేదు. నేనిపుడు ముదుసలినై దేహబలము తగ్గినవాడ నగుచున్నాను. ఇపుడిక నీవంటి విద్వాంసుని గాంచగలుగుటచే, నాజ్ఞాన జలమును, నిలువ జేసికొనుటకు నీయందు తగిన పాత్రను లభించిన వాడ నగుచున్నాను. నా జ్ఞాన జ్యోతిని చల్లార్చిపోకుండ నాయనంతరముకూడ సంపూర్ణ తేజముతో వెలిగింప గల మహనీయుని గాంచగల్గితిని. నిజముగా నీవే నావెనుక, నీ ధర్మాధ్యక్ష పీఠము నధిష్ఠించి, పరిశుద్ధమైనదియు, నుత్క్రుష్టమైనదియు నగు ' ధర్మమును ' ప్రతిపాదించి వ్యాపింప జేయగల సమర్ధుడవు. కావున నాతోడ గూడ కొన్ని ధర్మ రహస్యములను గ్రహింతువుగాక, రమ్ము!" అని బల్కెను.

"దేవుడీ మాటలు విని సంతుష్టాంతరంగుడై అహంకారముతో తానే సర్వజ్ఞుడని గర్వించెను. అంతటనుంచి తన తార్కికత్వమును, పాండిత్యమును దేటపడ అలంకారములతో, శబ్దాడంబర వాక్యములతో సంభాషింప నారంభించెను. బోధిసత్త్వుడు తన వాగ్దోరణిని మెచ్చుకొనుచుండెనేమోయని సంతోషించుచు, నొకసారి నాగార్జునివంక చూచెను. కాని యాతని ముఖమున యొక అసంతృప్తియు నాగ్రహమును వ్యక్తమగుచుండుట గాంచి, భయకంపితు డయ్యెను. వికలచిత్తు డగుటచే మాటలు తడబడ