పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౨౨

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

నింపి దానిని దేవుని కడ కట్లె గొంపోవ వలసొనదని యాజ్ఞాపించెను. దేవబోధిసత్త్వుడా జలపూరిత పాత్ర నవలోకించి మాటాడక మెల్లగా సూదినొకదానిని అందు జారవిడచి యూరకుందెను. అదిచూచి, శిష్యుడేమియు దోచక నిశ్చేష్ఠుడైయుండి, పిమ్మట నే సమాధానమును గానలేక, నాగార్జునకడ కాపాత్రను తిరిగి పట్తుకొని వచ్చి, జరిగిన దంతయు విన్నవించెను. నాగార్జునుడపుడు "ఆహా! ఏమాతని ప్రజ్ఞావిశేషము! ఇట్టి మహనీయుని నేనెపుడును గాంచి యుండ లేదు. మానవుల హృదయమును దెలిసికొనగల సమర్ధుడు ఒక్కడీశ్వరుడేగదా. అయినను మానవ హృదయాంతరాళము నుండి యుద్భవించు సూక్ష్మవిషయములను సయితము గ్రహింపగల సమర్ధుడీతడు తప్పక మాహానుభావుడ తడును, జ్ఞానియు గావలయును. కావున సత్వరమాతనిని లోనికి బ్రవేశ పెట్టుము" యని యానతి నిచ్చెను. శిష్యుడామాటలను విని "ఆచార్యా! ఏమిచోద్యమిది! మూగివానివలె మాటలాడ కూరకుండువాడు సర్వజ్ఞుడగునా!" అని ఆశ్చర్యముతో నడిగెను. అంత సర్వజ్ఞు డపుడు"వత్యా! యిటు వినుము. జలపూరితమయిన యీ పాత్రయందు సంపూర్ణమయిన నాజ్ఞానమును సూచించు చున్నది. యీపాత్రయందు ప్రతిసందు సందులో ఈ జలమెట్లు వ్యాపింపగలిగి యున్నదో, అట్లే నాజ్ఞానముగూడ, విశ్వమం తయు వ్యాపించి యున్నది. ఈ జలమెట్లు పరిశుభ్రమైనదిగా వచ్చునో అట్లు నాజ్ఞానమును