పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యూఁఆన్‌చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

౨౧

సుమా రొక నూరు సంఘారామము లున్నవి.అందు దాదాపుగా పది వేలమంది భిక్షువులున్నారు. వీరందఱు మహాయానశాఖా సంబంధులే. మరియు నీదేశమున డెబ్బది బ్రాహ్మాణ దేవాలయములు గూడ నున్నవి. బౌద్ధులుగాక నిక్కడి జనులలో చాలమంది బ్రాగ్మాణులును జైనులు గూడ నున్నారు.

"కోసల రాజధానికి దక్షిణపుదిక్కున అనతి దూరమున అశోకవనమును అందొక స్తూపమును కలవు. పూర్వ కాలమున నిచ్చట తథాగతుడు ధర్మసభను సమకూర్చి తన ప్రజ్ఞాతి శయములచే చాలమంది బ్రాహ్మాణులను బౌద్ధులను జేసియుండెను. తరువాతి కాలమున బోధిసత్వుడగు నాగార్జునుడీ సంఘారామమున జాలకాలము నివసించెను. అపుడీదేశము నేలుచుండిన రాజుపేరు సాద్వహుడు. అతడు నాగార్జునుని విశేషముగ నాదరించి గౌరవించెను.

"సింహళద్వీపము నుండి యొకప్పుడొక బోధిసత్త్వుడు దేవుడనువాడు, నాగార్జునుని ప్రజ్ఞావిశేషములను విని, యాతనితో వాదింప నిచ్చగొని బయలుదేరి వచ్చి నాగార్జున బోధిసత్త్వునికి తనరాక నెఱిగింపుమని కావలి వానిని కోరెను. ద్వారపాలకుడంతట లోనికరిగి దేవుని రాకదెల్పెను. నాగార్జునుడంతకు బూర్వము దేవబోధి సత్త్వుని పాండిత్యమును, మహిమాతిశయమును వినియుండిన వాఁడగుటచే, తక్షణమె శిష్యునొకని బిలచి యొకపాత్ర యందు నీరు