పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౮

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

గాంపించుచున్నవి. ఏడవశతాబ్దమునకు బూర్వము కళింగము కొంతకాలము పల్లవరాజుల పరిపాలనము క్రింద నుండెను[1]. ఆకాలమున పిష్ఠపురమో యలమంచిలియా, నరసన్నపేట సమిాపముననున్న సింహపురమో, రాజధానియై యుండవలయును. ఈపల్లవ రాజులలో సింహపురశాసనమందు నంద ప్రభంజనవర్మ, చండవర్మ, ఉమవర్మ యను మువ్వు ర రాజులపేరు లుదాహరింపబడి గానవచ్చుచున్నవి[2]. వీరిలో నెవ్వరుముందో యెవ్వరు తరువాతనో తెలియరాదు. కాని వీరందఱకును సింహపురము రాజధానిగా నుండిన మాట నిశ్చయము. క్రీ. శ. ౫, ౬ శతాబ్దములందు కళింగరాజులకును వేంగిరాజులయిన విష్ణుకుండినులకును బద్ధవైరముగా నుండెను. దక్షిణకోసలము నేలు వాకాటకరాజులు, విష్ణుకుండినులకు దగ్గర బంధువులగుటచేత నుభయులును కళింగరాజ్యమునకు చాలభాధాకరులుగా నుండి ఇరుప్రక్కలనుండి తొందరలు గలుగ జేయుచుండిరి. ఈ కారణమున సర్వదా యుద్ధములలో మునిగి తేలుచుండుటవలన యుఁఆన్‌ చ్వాంగ్‌నకు దేశము జనసమ్మర్దముగా గన్పట్టియుండక పోవుటలో నాశ్చర్యమేమి? ఏడవశతాబ్దమందు కళింగరాజ్యమున గాంగపల్లవ వంశమొకటి తలయెత్తి విజృంభించి కళింగనగరమును (ముఖలింగము) రాజధాని

  1. Ancient History the Dekhan by G.J.Dubreuil p93-94
  2. పూర్వోక్త ప్రమాణము