పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౨

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

"ఈ కొన్యోఢము వేయిలీలు చుట్టుకొలత కలిగియున్నది. రాజధాని చుట్టుకొలత యిరువది లీలుండును. దేశమంతయు కొండలతో నిండియున్నది. సముద్రమిచ్చట చేరువగా నుండి వలయాకారముగ లోనికి జొచ్చుకొనిపోయి నొక అఖాతము క్రింద నేర్పడియున్నది. ఈ ప్రాంత ముష్ణముగా నున్నను పంటలు చక్కగా ఫలించుచున్నవి. ఇచ్చట జనులు, పొడవైనవారు, ధైర్యశాలురు, కొంచెము చామాన ఛాయగల మేనివారు. స్వగౌరవమును, వివేచనయు నెఱగి ప్రవర్తింతురు. మోసము చేయుటంతగా నెఱుగరు. వారి భాషాలిపి, యుత్తర హిందూస్థానమునం దుపయోగింప బడుదానివలె నున్నది. కాని భాషామాత్రము వేరొకటిగా గనుపించును. ఇచ్చటి జనులలో బౌద్ధులు గానరారు. దేవాలయములు నూరువఱకును, తీర్థకుల (జైనులు) ఆలయములు పదివేల వఱకు నిచ్చట గలవు. సముద్రతీరమునంటి యిాదేశమున పదిపట్టణములు మాత్రమే గలవు. అవియన్నియు, ఏటవాలుగనున్న కొండలపై నిర్మింపబడియున్నవి. ఇచ్చట జనులు నాణెములకు బదులు ముత్యములను, గవ్వలను వాడుదురు. దుర్గమమైన దేశమగుటచేతను, సైన్యములు విశేషముగ నుండుట చేతను కొన్యోఢము శత్రుభయంకరముగా నున్నది".

ఏడవ శతాబ్ధమునందీ ప్రాంతము కళింగమునకు నాంధ్రదేశమునకు మడుమ సరిహాద్ధుగా నుండినట్లు గానబడు చున్నది. ఇక్కడనుండి, యుఁఆన్‌ చ్వాంగ్, కళింగమును