పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్‌-చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

అస్థికలను నూటయేబదింటిని భద్రముగ గొనివచ్చెను.

వీని నన్నిటిని జూచి చక్రవర్తి, యాతడు నివసింపదలచిన సంఘారామమునకు విశేషముగ ధన కనక వస్తు వాహనము జొసంగి హిందూదేశమునుండి గొనరాబడిన సంస్కృత గ్రంథములను, చీనా భాషలోనికి భాషాంతీ కరించుటకు పండితులను జీతములిచ్చి నియోగించెను. యుఁఆన్‌చ్వాంగ్‌ను, శేషించిన తన జీవితకాలమును బౌద్ధ ధర్మ గ్రంధములను భాషాంతరము చేయుచు మహాయన బౌద్ధధర్మమును శిష్యుల కుపదేశించుచుఁ గాలము బుచ్చెను. అతఁడు క్రీ. శ. ౬౬౪ వ సంవత్సరమున ద్వితీయమాసమున, షష్టమ దివసమున, యీ భౌతిక కాయమును విడచెను. తనకు రానున్న యా పరిణామము నాతడు ఎరిగియుండి, తాను సంకల్పించిన పనిని పూర్తిగా నెరవేర్చెను. ఇప్పుడాతఁడు తుషిత స్వర్గమున నుండి మైత్రేయ బోధిసత్వుడు సుగరుఁడై వచ్చునం దాక పరలోకమున వేచియున్నాడని చీనావారి విశ్వాసము. మరల తాను మైత్రేయునితో నీలోకమున నవతరిం పగలనని యుఁఆన్‌ చ్వాంగును విశ్వసించి యుండెను.

యుఁఆన్‌ చ్వాంగ్ మతావేశముచే బౌద్ధుడైనను, స్వదేశాభిమానమును, స్వజాతీయ సంప్రదాయములను, త్రోసి పుచ్చలేదు. కన్‌ప్యూషియన్‌ యొక్క మతసంప్రదాయము లాతనిని ఎంత సన్నాసియైనను వదలవయ్యెను. పూర్వాశ్రమన బంధులయిన సోదరులయందును, తలిదండ్రులయందును ఆతడు