పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరులను వెంటబెట్టుకొని వచ్చినాడని వ్రాసినది, యదార్థమని యొప్పుకొనక తప్పదు.

దేవరాయని సమకాలీనులలో, రాజమహేంద్రవరము రాజధానిగా, పూర్వాంధ్రదేశమును చిల్కసముద్రము పత్యంతమునేలిన అల్లాడ వీరారెడ్డి, వేమారెడ్లు, మిక్కిలి ప్రఖ్యాంతిగాంచినవారు. వారి యాస్థానమునందే, కవిసార్వభౌముడగు శ్రీనాథుడు తనకౌమార దశనంతయు, గడపి యుండెను. ఈ రెడ్లకును, భామినీ సుల్తానులకును గల స్నేహమువలన, కర్ణాట భూపాలునకు వీరు ప్రబలుశత్రువులుగావలసివచ్చెను.

మన అబ్దుర్ రజాక్, నికోలోకొంటి, విజయనగరమును సందర్శించి పోయిన ఇరువది సంవత్సరములకు పారశీక రాయబారిగా నేతెంచి యుండెను. ఆతడు రాయబారమునకై క్రీ.శ. 1442 వ సంవత్సరము జనవరి 13 వ తేదిని బయలుదేరి ఎట్లో, పడరాని పాట్లుపడి ఆసంవత్సరము నవంబరు మాసాదిని కళ్ళికోట రేవును, జేరగల్గెను. కాని కళ్ళికోటలో నాతడు 1443 వ సంవత్సరము ఏప్రిల్ మాసాదివఱకుండి పోవలసివచ్చెను. అంతట రాయలచే నాహ్వానింపబడి, కళ్ళికోటనుండి బయలుదేరి ఏప్రియల్ మాసాంతమున కచ్చటికిజేరి యది మొదలుకొని డిశెంబరు 5 వ తేది వఱకును విజయనగరము నందుండెను. ఈతడు మహర్నవమి యుత్సవములని, వర్ణించినాడుగాని యాతని వర్ణనలుబట్టి ఆతడు జూచినది, వర్ణించినది, నవరాత్రియుత్సవము లగునోకాదో యని సందియము గలు