పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నాడు. దేవరాయలు, మహాసామ్రాజ్యమునుని నిర్మింప గలుగుటయేగాక దానికి సుస్థిరత్వమును సమకూర్చినగాని, గజకీట విలాసార్థముగా జేయుచుండుటకు తగిన యవకాశముండదు.

ఇమ్మడి దేవరాయలు కవితాప్రియుడు. రసజ్ఞుడు. విశేషించి కవియు గూడనై యుండి, తనయాస్థానమున బెక్కుమంది కవులను పండితులను ఆశ్రయమిచ్చెను. శ్రీనాధుడతని ముత్యాలశాలయందే క్రియాశక్తి ఒడయల సమక్షమున, గౌడడిండిమభట్ట కవి సార్వభౌముని యోడించి, యాతని కంచుడక్కను బగులగొట్టించి, కనకాభిషేకమును బడసినాడు. ఈతనికాలపు పరిస్థితులు శ్రీనాధుని చాటువుల కలసి తెలియ వచ్చుచున్నవి. దేవరాయలు సంస్కృత భాషయందు, కవియైయుండి, "మహానాటక సుధానిధి" యనునొక చంపూ కావ్యమును రచించి, అందు శ్రీరాముని చరిత్రము వర్ణించినాడు.

రాయలసోదరు డొకడు, రాయలపై కుట్రలుబన్ని, కౄరముగ వధింపనెంచినటుల, అబ్దుర్‌రజాక్ వ్రాసిన వ్రాతలు నిజము గావచ్చును. ఆదారుణకృత్యమును దలపెట్టిగ సోదరుడెవడో యింతవఱకు దెలియరాదు. ఆకుట్రలో, తగిలిన గాయములవలన రాయలు, వ్రణపీడితుడై యారుమాసములైన గతించక ముందె (1445 నందు) మరణించెను. ఈతని మరణమునకు బూర్వమె మన రాయబారి విజయనగరము నుండి,