పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నిటికంటె పారశీక దేశమునుండి సుల్తానుషా, రుఖ్ ప్రౌడదేవరాయల కడకు రాయబారిగా, అబ్దుల్‌రజాక్‌ను బంపుట, ప్రధానమైనది. రాయలకీర్తి, దిగంత విశ్రాంతయైన దనుటకును, ఆతడు, మహా పరాక్రమశాలి యనుటకు నాతని తోడి నెయ్యము, దేశాంతరముల నుండురాజన్యు లపేక్షించిరనుటకు నింతకంటె వేఱె కారణమేమి గావలయును? అబ్దుర్ రజాక్ విజయనగరమును సందర్శించుటకు బూర్వము నికోలో కోంటి యని ఇటాలియా వాస్తవ్యుడొకడు, వచ్చియుండెను. ఆతడు ప్రౌడదేవరాయల గూర్చి "యాతడు హిందూదేశములోని నృపాలురందరి కంటెను ఎక్కు బలపరాక్రమ సమనిర్వతుడు" అనివ్రాసి యున్నాడు. నికోలో చేసిన విజయనగర వర్ణనము, మన రజాక్ చేసిన వర్ణనలను ఇంచుమించుగా బోలియుండెను. రాజ్యమంతయు శాంతి ప్రదమై, రాజ్యకాలమంతయు సౌఖ్యావహమై యుండుటచేతనే ప్రజలకు విద్యాగోష్ఠియుండుటకును, సాంఘికా చారములందు సంస్కరణములు చేసుకొనుటకు నవకాశము కలిగినది. ఈతని కాలమున, వడైవీడుసీమ బ్రాహ్మణలు - కర్ణాటాంధ్ర ద్రావిడ లాట దేశీదేశీయులు - నప్పటినుండియు, (క్రీ.శ. 1425) వివాహములందు, కన్యాశుల్కమును దీసుకొను నాచారము మానితిమనియు, వివాహములు, కన్యాదానములుగావున కన్యావిక్రయములుగా జరుగరాదనియు, నొడంబడిక జేసుకొనిరి. ఆకట్టడియందు, కులపెద్దలు వ్రాళ్ళుచేసియుండిరి.