పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రతిగా, నాయా రాజ్యములపై పారుపత్తెము నిర్వహించుచు సమయానుకూలముగ నొక రాజ్యమునుండి మరియొక రాజ్యమునకు మార్చబడుచుండిరి. ఇట్టి ప్రధానులలో పెరుమాళ్ళ దణ్ణాయకుడు పశ్చిమ దేశములకును, చోళ, పాండ్య మండలములు అనగా రాజగంభీర రాజ్యమునకు లక్కణ, సింగణ వొడయులును, పారుపత్తెము నిర్వహించుచుండిరి. ఈ మువ్వురి ప్రధానులలో,లక్కణ దణ్ణాయకుడు, రాయల కార్యకర్తయై మహామంత్రియై, సామ్రాజ్యము నందంతటను పారుపత్తెమునడపు చుండెను. ఇతడే, మన అబ్దుర్ రజాక్, పేర్కొనిన మహాప్రధాని. ఇతడు బ్రాహ్మణుడు. కలబరిగెపై దండెత్తి విజయుడై వచ్చినదీతడే! లక్కణ వొడయలు, దేవరాయల యాజ్ఞ శిరసావహించి సింహళముపై దండెత్తి, యాలంకాధిపతి, కప్పము గట్టుటమాని నందున శిక్షించివచ్చెను, ఇయ్యది. అబ్దుర్ రజాక్ విజయనగరము నందున్నపు డెపుడో జరిగియుండ వలయును. కాని, అంతకు బూర్వము నుండియు లక్కణ ఒడయలకు దక్షిణసముద్రా ధీశ్వరుడని బిరుదముండుటచేత క్రీ.శ. 1441 సంవత్సరమునకు బూర్వమే సింహళద్వీపమును జయించి యుండినట్లు విశ్వసింపవలయును.

ఇమ్మడి దేవరాయల పరిపాలనము శాంతిప్రదమై, యుండినట్లును, ప్రజలు యుద్ధముల వలనగాని, దండయాత్రల వలనగాని, యేయొత్తిడిలేక సుఖముగా నుండిరనియు విశ్వసించుటకు ప్రబల కారణముల నేకములు గన్పట్టుచున్నవి.