పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానికుత్తరదేశము చంద్రగుత్తి రాజ్యమనియు బిలువబడుచుండెను. మైసూరు ప్రాంతమునకు దక్షిణమున ననగా నిప్పటి కొచ్చి, మలబారు దేశములు తెరకనాంబి రాజ్యమని బిలువబడు చుండెను. చంద్రగిరి రాజ్యమునకు దక్షిణమున రాజగంభీర రాజ్యమను మధుర రాజ్యముండెను. మైసూరు రాజ్యములో జేరిన ఆరగడ రాజ్యమును బ్రహక్షత్రియ వంశుజుడైన రాయప్ప ఒడయుని కుమారుడు శ్రీగిరినాధ బడయరు పరిపాలించుచుండెను. ఆకాలమున గుత్తిలేక, గోవచంద్రగుత్తిరాజ్యమ నొకరితరువాత నొకరు త్ర్యంబకదేవ, హండేయ రాయలనువారలు వరుసగా బాలించియుండిరి. మంగళూరు రాజ్యమును, వరుసగా నాగణఒడయలు, నాగమంగళం దేవరాయఒడయులు నేలియుండిరి. బారకూరు తుళువరాజ్యమును, చందరసఒడయులు, నరసింహదేవవొడయులు బాలించియుండిరి. దేవరాయుల తమ్ములలో వీరపార్వతిరాయుడు తెరకనాంబి రాజ్యమును, ప్రతాపదేవరాయలు వేలూరిరాజ్యమును, శ్రీగిరినాధుడు చంద్రగిరిరాజ్యమును బాలించుచుండిరి. తెలుగు భూమిలోని వినుకొండ రాజ్యమును, వల్లభరాయమంత్రి యేలుచుండెను. ముళువాయి రాజ్యమును అనగాకోలారు మండలమును సాళువ గోపరాజు పరిపాలించు చుండెను.

దేవరాయల రాజ్యపాలనాపద్ధతులు రజాక్ వర్ణించిన వన్నియు యదార్ధములయినట్లు శాసనప్రమాణములు గన్పట్టుచున్నవి. మండలేశ్వరులైన, దేవరాయని ప్రధానులు, రాయలకు