పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

హాసము చేయుచున్నట్లు, మనోజ్ఞమై యుండెను.పదునారేండ్ల క్రిందట, స్వదేశమును విచారముతో విడిచి చనువేళ సెలవు గైకొనిన టేకువృక్షముగూడ నిపుడు ముసలిదయ్యును, ప్రియస్నేహితుని యాగమమున కెదురుచూచుచున్నట్లు పశ్చిమదిశకు కొమ్మలన్నియు వాల్చెనట! ఆవృక్షమట్లు తలవాల్చుయే యుఁఆన్‌ చ్వాంగ్‌ స్వదేశాభిముఖుడైవచ్చుచున్నట్లు సూచనయని యాతని వారనుకొనిరి. నిజముగా నాతని రాక చాలదినముల వరకు జనుల కత్యాశ్చకరముగ నుండెను.

అతఁడు చెప్పిన వింతవింత విషయములను గూర్చివిసుగు విరామము లేక చక్రవర్తి యడుగుచు శ్రద్ధాభక్తుడై యాలకించెను. తుదకా విషయలపై మోహము బట్టజాలక యాతని దన యాత్రలనుగూర్చి యొకగ్రంథము వ్రాసి తనకు సమర్పింపుమని ప్రార్థించెను. చక్రవర్తి యాజ్ఙ నౌదలవహించి యుఁఆన్‌ చ్వాంగ్‌ "సి-యూ-కి" అను గ్రంథమును రచించెను.

అతడు స్వదేశమునకు తిరిగి వచ్చునప్పుడు ఆరువందల ఏబదియేడు బౌద్ధధర్మ, మంత్రశాస్త్ర, సూత్ర , వ్యాఖ్యాన గ్రంథములను, ఉష్ట్రములమిాదను, ఇరువది అశ్వములమిాదను వేసి తీసుకొని వచ్చెను. సువర్ణము, వెండి, మంచిగంధము మొదలగువానితో చేయబడిన బుద్ధుని ప్రతిమలను, బోధిస్వత్తులు, దేవతలు మొదలగు వారియొక్క మనోహరమయిన విగ్రహము లనేకములను తీసుకొని వచ్చెను. ఆనేక చిత్తరవులను తీసుకొని వచ్చెను. వీని యన్నింటికంటెను, బుద్ధునియొక్క