పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

-- సేనలను వెన్నాడి, దేశమును పరశురామ ప్రీతిచేసినాడు. చిరకాలమునుండి తురకలమీదనున్నకసిని, నాటి వారియుక్తులుతో తమ ఎత్తులనునుడిగి దీర్చుకొనిరి.

ఈయుద్దమునందు గాయపడి ఫిరోజుషా రాజధానిని జేరినవెనుక నెంతకాలమో జీవింపలేదు. అతని వెనుక నాతని రెండవ కుమారుడు అహమ్మదు సింహాసమధిష్టించెను. సుల్తాను అహమ్మదుషా, తన తండ్రికి జరిగిన యవమానమునకు అలుక వహించి, విజయనగర రాజ్యసీమలపై దండెత్తివచ్చెను.

అహమ్మదుషాకును, దేవరాయలకును అంతట రెండేండ్లు వరుసగా యుద్ధములు జరిగెను, సుల్తాను, ఆయుద్ధములందు త్రొక్కిన ప్రదేశమునెల్ల నిర్ధూమథామము గావించుచు కౄరుడై, స్త్రీలనక, శిశువులనక, చేతికందినవారి నెల్ల నఱకివేయించెను. ఈయుద్ధములం దొకప్పుడు విజయము, హిందువులకును, మరియొకప్పుడు తురకలకును, గలుగుచు చంచలయై యుండుటజూచి, దేశమున కాటకము రేగుచుండుటచే, సుల్తానును, రాయలును సంధిగావించుకొని, యుద్ధమునుండి విరమించిరి. అదిమొదలుగా, క్రీ.శ. 1435 వ సంవత్సరము వఱకును, దేవరాయలే యుద్ధములును లేక దేశమునందు శాంతియు, సౌఖ్యమును నెలకొల్పి, రాజ్యమును బాలించెను.

క్రీ.శ. 1435 సంవత్సరమున, అహమ్మదుషా మరణించెను. అంతనాతని పుత్రుడు రెండవ అల్లాఉద్దీను, భామినీ రాజ్యభారమును వహించెను. ఆ సంవత్సరమే యాతడు