పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్యమున కఖండవైభవైశ్వర్యములను, యశమును సంపాదించి, దేశదేశాంతరములనుండి యేతెంచిన రాయబారులకు తనకొలువున కాశ్రయమిచ్చి, ప్రతాపమూర్తియై, దిగంతవిశ్రాంతమైన యశము నార్జించి, కవియై, రసజ్ఞుడై, సార్వభౌముడై ప్రఖ్యాతి జెందినవాడు రెండవ లేక యిమ్మడి దేవరాయలు.

ఇమ్మడి దేవరాయలు శా.శ. 1343 (క్రీ. శ. 1421) శార్వరి సంవత్సరమున వైశాఖ మాసాదిని సింహాసనస్థుడై మాహారాయ బిరుదము ధరించి పరిపాలింప నారంభించెను. అంతకు బూర్వము కూడ నాతడుమూడు సంవత్సరములనుండి, తన తండ్రికి దోడుగా, యౌనరాజ్యపట్టభద్రుడై, తండ్రికిమారుగా, తానే సామ్రాజ్యమును బాలింప నారింభించినట్లు శాసనప్రమాణములు గాన్పించుచున్నవి. న్యూనిజు అను పోర్చుగీసు చరిత్రకారుడు, దేవరాయనికి యరువదియైదు సంవత్సరములు రాజ్యకాలము చెప్పుచున్నాడు. మరియు నీతనితండ్రి, విజయ (బుక్క) రాయలు ఆరు సంవత్సరములు రాజ్యముచేసెనని కూడ దెలుపుచున్నాడు. విజయరాయ, యిమ్మడిదే వరాయలు భయులును, కలిసి, మహారాయబిరుదముతో నీభూమండలినేలు చున్నట్లు. క్రీ.శ. 1418 మొదలుకొని 1421 వఱకును శాసనములు, గాన్పించుచున్నవి. [1]విజయరాయలు, కుమారునితో గలిసి మూడేండ్లును, తన తండ్రి

  1. Ep. Dar. Vol. X. Introducion, p. xxxv.