పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుభశకునమును పరీక్షించి, జిరాగడా మాసమున[1] 25 వ దినమున ఓడలంగరు నెత్తించితిని. ఓడప్రయాణము మాకు చాల యుపద్రవకరమయ్యెను. వరుసగా రెండు మాసము లించుమించుగా తుపాను రేగుచుండుటవలన మేము చాల యిబ్బందుల పాలబడితిమి. ఎట్టకేలకు హిజరాశకము 848 సంవత్సరమున ముహారము పండుగ సమీపించునప్పటికి (ఏప్రిల్=చైత్రము; క్రీ. శ. 1444) సముద్రపు గండములను గడచి మాదేశములోని కలహాట్ [2] శిఖరమును సందర్శింప గల్గితిమి.

సముద్రయాన సమాప్తి: హార్మజునగర ప్రవేశము.

"నాప్రయాణ చారిత్రముగూడ ముగియుచున్నది. మొహరముపండుగ గడచువఱకు మేము మస్కాటురేవును గూర్చి సుఖముగా పయనము సేయుచునే యుంటిమి. మస్కాటు రేవునుజేరి కొంతకాల మచ్చట లంగరుదింపి, సముద్రము మీద తుపానువలన గల్గిన నష్టమును కూడి తేర్చుకొని హార్మజు నగరమునకై ఓడ లంగలెత్తించి పయనము సాగించితిమి. మస్కాటురేవు దాటిన పిదప "ఖూర్‌పకాన్" రేవున రెండుదినములాగి, మరల బయలుదేరితిమి. అప్పటికి వేసవికాలపు వేడి దుర్భరమగుట చేత నారేవున రెండుదినముల వఱకు నాగ

  1. మాఘమాసాంతము గావచ్చును.
  2. కలహాట్ శిఖరము మస్కాట్ రేవునకు నలుబది మైళ్ళదూరమున నున్నది. దానియెత్తు 6000 అడుగులుండుచు.