పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుట్టినయపప్రధ నన్నింటిని నుడువుచు హార్మజు నగరవాస్తవ్యులు జూపిన యసూయతను వర్ణించి, మరియు నీవిధముగా వ్రాయించెను. "మీతోడ మాకు నెయ్యమును, స్నేహమును ఎంతయు మోదావహములును, వాంఛ నీయములును; గాని కొందఱు మాకు అబ్దుర్ రజాకు మీ భృత్యుడు గాడని చెప్పుచు వచ్చిరి; లేకుండిన యింతకంటె నెక్కువగా, మాగౌరవము జూపుచు, మాస్థితికి దగినట్లుగా కానుకల నంపి యుందుము; మీ రాయబారిని ఎక్కువగా గౌరవించియుందుము." పిమ్మటనా ప్రయాణసన్నాహము బూర్తిచేసికొని శుభదినమున స్వదేశమునకై బయనమైతిని.

స్వదేశాభిగమనము; నడుమ తుపాను.

"నా యదృష్టాకాశమున దైవకృప అను భానుడుదయమయ్యెను. ఆశాభువనగోళమున, భాగ్యతార ప్రకాశింప జొచ్చెను. కటికచీకటి రాత్రియందు, సంతోషకాంతులు వెలుగసాగెను. అంతట నాకు దైవమును నమ్మినవారి కేబాధయు నెప్పుడును గల్గదని తోచెను.

"హిందూస్థానమునం దొకచోట మారుమూల నున్నది ఈ విజయనగరము. దేశమంతయు, విగ్రహారాధనపరులు. నేను సంపాదించుకొనిన దంతయు, నాకష్టకాలము వ్యయమయి పోవుటచేత, ప్రయాణమునకు గావలసినంత ధనము నాయొద్ద లేకుండెను. ఇక, నా దురదృష్టపు సంగతులను