పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సానుదేశీయుడు, అనువారలను, రాజపరమేశ్వరు డనదగిన రాయలు అనేక అమూల్యాభరణములు, దుస్తులు, రత్నములు, కానుకలు, మొదలయినవి యొసంగి మాపారశీక చక్రవర్తికడకు ప్రతిరాయబార మంపించెను. ఆ సమయముననే, డిల్లీ సుల్తానుగానుండిన ఫిరోజుషావంశీయుడగు ఫతేఖానుగూడ, ఖ్వాజాజమాలుద్దీను అనునాతని తన వకీలుగా, నేర్పఱచి, మాచక్రవర్తికడకు అనేక కానుక లర్పించుచు నొక విన్నపమును బంపించియుండెను.

"నేను విజయనగరమునుండి, రాయలయొద్ద సెలవుగైకొని ప్రయాణమగు రోజున, చక్రవర్తి నన్ను జూచి కృపాలుడై "ఓయీ! నీవు నిజముగా, పారశీకసుల్తాను షారుఖ్ వారి భృత్యుడవు గావనియు, మమ్ము మోసముచేయ నేతెంచినవాడనియు ననేకులు మాతో చెప్పియుండిరి. లేకుండిన మావలన ఇంతకంటె గొప్ప యాదరణకును, గౌరవమునకు నీవు పాత్రుడవైయుందువు. గడచినదానికై నగవవలదు. ఎన్నటికైన నీవు తిరిగి మాకు విశ్వాసము గలిగినపిమ్మట మారాజ్యమునకు మీ సుల్తానువారిచే బంపబడుదువేని మా సామ్రాజ్యగౌరవప్రతిష్ఠలకు దగినరీతిని నిన్ను గౌరవించి బహూకరించెదము" అని పల్కెను.

"మా సుల్తానువారికి వ్రాసిన సుహృలేఖలో దేవరాయ మహారాయలు నావిషయమయి, తన దేశములో