పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపటరాయబారినై మెలగుచున్నాననియు నెన్నియో మంతనములను జెప్పుచుండిరి. రాజకీయోద్యోగులు నమ్మునట్లనేక అనృతములను కల్పించి, మెల్లమెల్లగా వాటిని రాయల చెవిసోకునట్లుగూడ జేసిరి.

ఇట్లుదినవెచ్చము లేక, శత్రువుల యసూయకు గురియై ధనములేక, గౌరవముచెడి, నిరాశచెంది, కొంత కాలమెట్లో యాపాపిష్టి రాజ్యమున, దుర్మార్గులయిన విగ్రహారాధకులగు ప్రజలమధ్య కాలము గడిపితిని. నే నిట్లు ఇడుమల బడుచుండినను, అప్పుడప్పుడు పురవీథులందు రాయ లూరేగుచు నా కెదురయినపుడు మదపుటేనుంగు నాపి, చిరునగవుతో, దయారసమొలుక నాయోగక్షేమ మారయుచునే యుండెను. నిజముగా మహారాజు చాలా ఔదార్యము గలవాడు. సుగుణముల పుంజ మనదగిన మహానుభావుడు.

పారశీకదేశమునకు రాయలు రాయబారము నంపుట.

"ఇంతలో బ్రాహ్మణ ధన్నాయకుడు కలబరిగె రాజ్యముపై దండయాత్రలు ముగించి, దురదృష్టవంతులగు కొందరిని బానిసలగను, ఖైదీలుగచు బట్టుకొని, రాజధానికి విజయలక్ష్మీతో మరలివచ్చెచు. ఆతడు రాజధానిని ప్రవేశించిన దినముననే, నా దుస్థితిని గూర్చి విని, హంబనురీర్‌ను చాలమందలించి, ఆ దినముననే నా ఖర్చులకై ఏడువేల పణముల నివ్వవలసినదని టంకసాలకు బరాత మిచ్చెను. విజయనగర వాస్తవ్యులయిన ఖ్వాజ్వా-మసూద్, ఖజామమ్మదు (ఖురా