పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యదులకు మౌల్వీలకు నొసంగును. నేను అతని దేసమును ధ్వంసముచేసి నా వేటకాండ్రకును, ద్విజోత్తములకు నొసంగుదును" అని గంభీర భాషణముల దిరస్కరించిపల్కి రాయబారి నవమానించి పంపివైచెను. పిమ్మట ఉభయులును సమర సన్నాహము చేయించి రణరంగమున సైన్యముల నడిపిరి. ఒకరి దేశముల నొకరు కొంతకాలము కొల్లగొట్టిపాడుచేసరి.[1]

ప్రధానమంత్రి హంబనురీర్.[2]

"కలబరిగె రాజ్యముపై దండెత్తిపోయిన, బ్రాహణ

  1. ఫెరిష్టాకూడ నీ కాలమున (1443 - 4 క్రీ.శ.) దేవరాయలకును, అహమ్మదుషాకును, యుద్ధము సంభవించెనని తెల్పుచు నందులకు వేఱుకారణములను దెలిపియున్నాడు. మూడుమాసముల కాలము యుద్ధము సాగెను. అందు మూడు ఘోరయుద్ధములు జరిగెను. మూడింటియందును కర్ణాటాంధ్ర సైన్యములే గెలుపొందుచువచ్చినివి. చూడుడు: Briggs Forishta Volume II, p.p. 430 - 435.
  2. ఈపదము విపు నేవిధముగ పూర్వస్థితికి సమన్వయింపవలెనో తోచకున్నది. అబ్దుల్ రజాక్ యీపేరును తప్పగా నుచ్చరించి వ్రాసుకొనినట్లు కన్పట్టుచున్నది. అబ్దుర్ రజాక్ గ్రంథముయొక్క మరియొకప్రతియందు "నిమపజీర్" అని యున్నది. కాని పెక్కుప్రతులందు హంబనురీర్ అని యున్నందుల నిదియే సరియైన పాఠమని యెంచదగును. దేవరాయల ప్రధానులలో త్ర్యంబక దేవఒడయలని యొకరును, హండేయరాయలని యింకొకరును గలరు. వారెవరైన యీఅబ్దుర్ రజాక్ కాలమున కొలదికాలము ప్రధానియుద్యోగము నిర్వహించిరేమో తెలియదు. హంబనురీర్ అనునది కొంచమించుమంచుగా త్ర్యంబకదేవ అనుదానికి సరిపోవుచున్నది. త్ర్యంబకదేవుడు చంత్రగుత్తిసీమాధిపతి. ఈవిషయ మింకను విచార్యము.