పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్‌చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

నాటగోలె పదునారు సంవత్సరము లాతడు విదేశములందు సంచారముచేసి క్రీ. శ. ౬౪౪ వ సంవత్సర చైత్రమాసమున స్వదేశము జేరెను. ఈతని కీర్తిని పాండిత్యమును మహిమను కర్ణాకర్ణిగ నప్పటికే వినియుండుట వలన చక్రవర్తి, యాతడు తన సెలవుగైకొనకుండ యరుగుటవలన జేసిన దప్పిదమును మన్నించి గౌరవించి సంభావించెను. చక్రవర్తి సకల సామంత నియోగప్రభృతులకును అతని యాగమన సమయమున మహోత్సవమును జరిపింపవలసినదని యాజ్ఞాపించెను. అతని పురప్రవేశ సమయమున వీధులందు పచ్చని యాకుతోరణములు పుష్పగుచ్ఛములు వేలాడగట్టెను. ఎచ్చటఁజూచినను రంగురంగుల పతాకముల ఎగురకట్టబడెను. పట్టణమంతయు శోభనదేవతాకాశ్రయమువలె పెండ్లిపందిరి యట్లలంకరింపబడెను. వీధులందు, రధ్యలందు, పల్లీ పట్టణ, గ్రామముల నుండి యా మహనీయుని యొకసారి సందర్శించి, జన్మపావనము గావించుకొనదలచి విచ్చేసిన జనులు గుంపులు గుంపులుగ క్రిక్కిరిసియుండిరి. యుఁఆన్‌చాంగ్‌ పునరాగమనము ఒక తిరునాళ్ళయుత్సవము వలె గడచిపోయెను. చీనాదేశచారిత్రమునం దెవడును, మరియొక బౌద్ధబిక్షువునకు ఇంతటి మహదానందముతో, ఇంతటి మహోత్సవముతో వీడ్కోలీయబడుట, వినియుండలేదు. నాడు ప్రకృతికూడ, మనోహరమై నగరవాసుల యుత్సా హమున కుత్తేజనమిచ్చునట్లు, మంద