పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవరాయలను ఆతని సామంతులను వధించుటకు ప్రయత్నముల వల్లనినిసంతుష్టాంతరంగుడై, రాయలకు తనధూర స్వభావము తేటబడ "ఏడు లక్షలవరహాలనిపుడు నాకుగప్పముగా జెల్లింపుము, లేనియెడల నీరాజ్యమును భస్మీపటలము చేయజాలు సైన్యమును బంపి, నిన్నును నీమతస్థులను రూపుమాపెదను" అనివార్తనంపెను. విజయనగరాధీశుడగు దేవరాయలా మాటలాలకించి క్రోధావేశపరవడై "ఔరా! ఏమి వీనికండకావరము, తురష్కుల ముష్కరత! నేనింకను జీవించియుండగనే, ఎవరో కొద్దిపాటిమంది మావారు, చనిపోయి నంతమాత్రాన అహమ్మదుషా యిట్టి విపరీతపు తలంపుతో నన్ను జయింపదలచెనా మంచిది. మీసుల్తానుతో కయ్యము సేయుటయే మాకు సమ్మతము. మిమ్ములను ఎదుర్కొని సమరము చేయుటకు నాకు దగిన బలగమున్నది, ఒక్కరోజులో నొక లక్షసైన్యమును గూర్పగలను. సూర్యుడు తేజోమూర్తి వెలుగునంతకాలము ప్రతియణువును కనబడును. నాశత్రువులు, నాకుమహోపద్రవము తటస్థించినదనిగాని; నాబంధుమిత్ర పరివారము నశించిరనిగాని నన్నందఱు ద్రోహలయి వీడిరనిగాని యెంచినయెడల వారు మిక్కిలి పొరబడిన వారగుదురు. నాకివి శుభదినములు, నాకిది మంచిదశ, నాకేయాపదయు వాటిల్లదు. నా సైన్యము లెక్కడకు బోయినను జయభేరినే మ్రోగింపగలవు గాని పలాయనము కావు. అదృష్టదేవత నావైపున్నది. ఇపుడు మీసుల్తాను నాదేశములోని ప్రజలను కొల్లగొట్టి ధనమును గొనిపోయి,