పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యట్ల అనేకదీనారములతో నింపబడిసంచుల తాంబూలమును, తనకైప్రత్యేకముగా నుండుకొనిన కొన్నియపరూపపుఫలములనిచ్చి యింటికిబంపివైచెను.

హార్మజు (హురుమంజ) నగరవాసుల మాత్సర్యము

"విజయ నగరమున కొంతకాలమునుండి నివసించుచుండిన హార్మజనగరవాస్తవ్యులు కొందఱు నాకు రాజుజూపిన గౌరవమును, ఆదరమును, ప్రేమను జూచి సహింపజాలక, మీదుమిక్కిలి, మాయేలికకు రాయబార మంపబూనుట విని యోర్చుకొనజాలక మాత్సర్యగ్రస్తులయి యెటులయిన మాస్నేహసౌధమును ధ్వంసముజేయ బ్రయత్నించిరి. ఈఅల్పజ్ఞుడు, నిజముగా ఖాకానిసయిదు సుల్తానువారి నిజమైన రాయబారి కాడనియు, కపటవేషము బూని వచ్చినవాడనియు నొక యపవాదమును వ్యాపింపజేసిరి. నాదురదృష్టవశమున నీవార్త క్రమక్రమముగా, ఆనోటనుండి యానోటబడి రాజ్యోద్యోగుల నుండి మంత్రి దళవాయులకు, తుదకు రాయలవారికి జేరెను. ఆవల జరిగిన వృత్తాంతమును పిమ్మట దెల్పెను.

కల్బరిగపై దండయాత్ర.

"విజయనగరమునందు వృత్తాంతము లిట్టులుండ నన్నింతవఱ కత్యంతాదరగౌరవములతో మన్నించుచుండిన ధన్నాయకుడు (మహాప్రధాని) కలబరిగె రాజ్యముపై దండెత్తి పోయెను. కలబరిగ రాజ్యము నాకాలమున సుల్తాను అల్లాఉద్దీన్ అహమ్మదుషా పరిపాలించు చుండెను. సుల్తాను అహమ్మదుషా, విజయనగరమున