పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొకచో నుంచిరి. వానిలో మొదటి రెండుదూలముల మీదను, అంతేయెత్తును లావును వెడల్పును గల మరి రెండుదూలముల నమర్చియుంచిరి. వీటిపైన నొకచిన్న దూలము నుంచిరి. ఇయ్యది యంతయు మెట్లవలె నమర్పబడి యుండెను. ఈవిద్యకే శిక్షణగావింపబడిన యేనుగు నొకదానిని దెచ్చిరి. అది మెల్లగా సోపానములుగా గట్టబడిన యాదూలములపై కెక్కెను. మొదటి సోపానము మీదనుండి, రెండవదానమీదకు, అందుండి జేనెడైన వెడల్పులేని మూడవమెట్టు మీదకుకూడ నాఏనుగు నేర్పరితనముతో నెక్కి నాలుగు పాదములను మోపెను. అంతట దానిపాదములు మోపినదూలము ప్రక్క దూలముల నన్నిటిని దీసివైచిరి. అచ్చట నిలువబడిన యాగజము క్రింద దొమ్మరివాండ్రు పాడు వింత పాటలకు తొండముతో తాళము వేయుచు, ఎత్తును, దించుచుండెను.

"మరియొక చోట పదిగజము లెత్తుగల స్తంభము నొక దానిని నిలువబెట్టిరి. అ స్తంభము కొనయం దొక రంధ్రమును జేసి యందుండి మరియొక దూలమును దూర్చి త్రాసువలె నమర్చిరి. ఆవాసమున కొకవైపు ఏనుగంత బరువుగలయొక పెద్దఱాతిని వ్రేలాడగట్టిరి. రెండవ వైపున ఒకగజము పొడవు చాలశాలమును గల యొకపలకను తాళ్ళతోకట్టి వ్రేలాడతీసిరి. ఆపలక కొకబలమైన త్రాడును గట్టిరి. ఒక ఏనుగును దెచ్చి యాపలకమీద నెక్కించి, త్రాసునందువలె, యొకప్రక్క బండరాతిని, మరియొక ప్రక్క యేనుగును ఎక్కించిం