పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యములు చూపరులకు గన్పట్టుచుండెను. అందు గాయకులు వీరకధలు పాడువారును విశేషముగా నుండిరి. గాయకులలో జాలమంది జవ్వనులగు స్త్రీలే కలరు. అవిలాసినుల తళుకు చెక్కులు చంద్రునిసోయగమును బోలియుండెను. యౌవనప్రాదుర్భానముతో వికసించువారి నెమ్మోములు వసంతాగమనమున చివురించు తొల్కరివలె మనోజ్ఞములయి యుండెను. సర్వల, కారభూషితలయి, శృంగారంపు కణికలయి, నృత్యము చేయుచున్న యా బాలికల రూపము, సౌందర్యము, విలాసము, హొయలు, శృంగారము, వేయేల వారి వాలుచూపులు మా హృదయములను, గులాబి పుష్పములను జూచినపుడువోలె తహతహలాడించు చుండెను. ఆసౌందర్యవతులు రాయల కెదురుగా నొక అందమైన తెఱవెనుక కూర్చుండిరి. ఇంతలో తటాలున నాతెర రెండువైపులనుండి లాగివేయబడెను. తెఱ దింపినంతలో నాసుందరులు నృత్యముచేయ నారంభించిరి. చూడ ఆహాఏమి ఆనృత్యము! సర్వసంగపరి త్యాగులయిన మునులకు మతిచలింపజేసెడి వారి నృత్యములు, హస్తవిన్యాసములు, కడగంటిచూపులు, ఆహా! మాయాత్మ లానృత్యదర్శనముచే సంతుష్టిచెంది పరవశములయ్యెను.

బొమ్మలాటవాండ్రు, దొమ్మరి, గారడివాండ్రు

"ఇక గారడివాండ్రత్యద్భుతమయిన వింతలను జూపిరి. గజము పొడవును ఒకమారెడు వెడల్పును, మూడునాలుగు గజము లెత్తును గల దూలములను మూడింటిని కలిపి కట్టి