పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డివాండ్రు, దొమ్మరివాండ్రు, విప్రవినోదులు; మున్నగువారు ఆసీనులయితమ నేర్పరితనమును, చూపు విద్యలను ప్రదర్శించుచుందురు. ఈయేనుగుల ముఖములపై, తొండములపై వింత వింతరంగులతో చిత్రింపబడిన రూపములు చిత్రములు చిత్రింపబడి మనోహరముగ ఘట్టంబడియుండును.

"రజాబ్ మాసమునపూర్ణిమనాడు(ఆశ్వీయుజము 1446 క్రి.శ.) విశాలమయిన యొక మైదానము మీద రాయలు డేరాలు వేయించి కొలుయుండెను. అతడేర్పఱచిన ముహూర్తనమునకు రాజ్యమునందలి మహాప్రధానులు, దళవాయిలు, ధన్నాయకులు, మండలేశ్వరులు, బ్రాహ్మణులు, రాక్షసులనుబోలు ఏనుగులు రాయలసమక్షమున కొలువు బలిసియుండిరి.[1]

ఆవిశాలమయిన మైదానమున, నువ్వుగింజలు చల్లిన రాలనియా జనసమూహము, నడుమనడుమ మహోన్నతములయిన ఏనుగులు, వింతరంగులు కనులు మిరుమిట్లు గొల్పుచిత్రములు, పతాకములుగల, అంబారీలు, అన్నియు నొక మహాసముద్రమును దలపునకు దెచ్చుదుండెను.

"సుందరమైన యాబయలునందు, రమణీయమైన మందిరములు, అయిదేసి అంతస్థులు ఎత్తుగలవి అనేకమును నిర్మింపబడి యున్నవి. ఆయంతస్థులయందు అత్యద్భుతములయి, విధములయి, నానావిధరూపములతో సొంపుమీఱిచిత్రములు,

  1. రజాక్ మహర్నవమి యుత్సవమునాడు విజయనగరమున నుండినట్లాతని వ్రాత వలన దెలియుచున్నది అబ్దుర్ రజాక్ మహర్నవమిని మహానవియని బిలిచినాడు.